ఆపద సమయాల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థినిలు డయల్ 100 నెంబరుకు ఫోన్ చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి డయల్ 100, 112 నెంబర్ గురించి తెలిసే వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని డీజీపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక్క రోజులోనే పోలీసు కానిస్టేబుళ్లు రెండు వేలకుపైగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించినట్లు డీజీపీ వెల్లడించారు.
ఇదీ చూడండి : వ్యవసాయ, ఔషధరంగ అభివృద్ధిపై జాతీయ సదస్సు ప్రారంభం