కరోనా కాలం ఇది. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా మూల్యం తప్పదు. అందుకే అనవసరంగా రోడ్ల పైకి రాకుండా ప్రజల్ని... పోలీసులు కట్టడి చేస్తున్నారు. అయినా ఎదో ఒక సాకుతో ప్రజలు రోడ్డెక్కుత్తున్నారు. అటువంటి వారికి అవగహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో ఆర్డీటీ సంస్థ అధ్వర్యంలో వినూత్న ప్రయత్నం చేశారు. కరోనా వేషధారణతో.. కూరగాయల మార్కెట్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంబేడ్కర్ సెంటర్లో తిరుగుతున్న వాహనదారులను ఆపి మరీ ముఖానికి మాస్కు ధరించేలా చేస్తున్నారు.