ETV Bharat / state

పర్యాటకంలో ప్రోత్సాహకం... వివిధ విభాగాలకు అవార్డుల ప్రదానం - Tourism awards news

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు అవార్డులు అందిస్తునట్లు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు అవార్డులు

author img

By

Published : Sep 27, 2020, 10:36 AM IST

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజం శాఖ అవార్డులను వివిధ విభాగాలకు అందిస్తునట్లు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా సమయం లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. లాక్ డౌన్ తర్వాత విదేశీ పర్యాటకులు, యాత్రికులకు హోం క్వారంటైన్ లో హైదరాబాద్ లోని హోటల్స్, తెలంగాణ టూరిజం ప్రముఖ పాత్ర పోషించాయన్నారు.

టూరిజం అభివృద్ధి కోసం...

భవిష్యత్ లో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో సీఎం కేసీఆర్ టూరిజం అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాళేశ్వరం, మేటిగడ్డ, అన్నారం, మిడ్ మానేరు, కోయిల్ సాగర్, కరివేన, ఉద్దండపూర్, లక్నవరం లాంటి రిజర్వాయర్ ల వద్ద టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు సోమశిల, పాకాలలలో టూరిజం అభివృద్ధి చేశామన్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్, ఫణిగిరి, కోటిలింగాలలలో బుద్ధిజం అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్...

ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ లో ఉన్న దేశంలో అతిపెద్ద ఎకో పార్క్ అయిన కేసీఆర్‌ అర్బన్ ఎకో టూరిజం పార్క్, వికారాబాద్ లో ఉన్న అనంతగిరి, నల్లమల వరకు ఉన్న అద్భుతమైన ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎకో పార్కులు, బొగత, కుంతల, పొచ్చేరా లాంటి అద్భుతమైన జలపాతాలలో ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా యాదాద్రి, బాసర, వేములవాడ, మన్యంకొండ, తదితర దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

కేటీఆర్ సూచన మేరకు...

మంత్రి కేటీ రామారావు సూచనల మేరకు హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ, అర్బన్ ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్, ట్యాంక్ బండ్, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, హెచ్‌ఎండీఎ, టూరిజం ఆధ్వర్యంలో దుర్గం చెరువును అద్భుతమైన పార్క్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: అలా చేస్తేనే పర్యటకానికి పునరుజ్జీవం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.