Avoid These Mistakes While Applying for Kalyana Lakshmi / Shaadi Mubarak Scheme: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు తీసుకొచ్చిన పథకాలే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్. ఈ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లికి 1,00,116 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. మరి, ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?.. దరఖాస్తు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలి?
How to Apply Kalyana Lakshmi /Shaadi Mubarak
- ముందుగా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కాస్త కిందకు స్క్రోల్ చేస్తే "కల్యాణ లక్ష్మీ /షాదీ ముబారక్" ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే.. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు తెరుచుకున్న పేజీలో.. పైన కల్యాణ లక్ష్మీ, కింద షాదీ ముబారక్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇక్కడ "రిజిస్ట్రేషన్" అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు పెళ్లికూతురు వ్యక్తిగత సమాచారం మొదలు.. కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలన్నీ సమర్పించాలి.
- ఆ తర్వాత వరుడి వయస్సు కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. మరికొంత సమాచారం అందించాలి. చివరలో అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి.
- సమాచారం మొత్తం అందించిన తర్వాత.. "Submit" ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
దరఖాస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కల్యాణ లక్ష్మీ/ షాదీ ముబారక్ అప్లికేషన్‌ను ఫిల్ చేసే సమయంలో వధూవరులు, తల్లిదండ్రుల పేర్లను తప్పుగా ఎంటర్ చేయవద్దు.
- గుర్తింపు కార్డులో ఉన్న విధంగా పేర్లను నమోదు చేయండి. ఒక్క అక్షరం తప్పు పడినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
- మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ తప్పులు లేకుండా రాయాలి.
- అడ్రస్ ఫిల్ చేసే ముందు కచ్చితమైన చిరునామాను మాత్రమే ఎంటర్ చేయాలి.
- పెళ్లి జరిగిన తేదీ, ప్రదేశం.. వంటి వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోని ఎంటర్ చేయాలి.
- బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసే ముందు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఒక్క నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా.. డబ్బులు అకౌంట్లో పడవు.
- అలాగే సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే సమయంలో ఏఏ పత్రాలు అప్లోడ్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. అలాగే అవి ఏ సైజ్‌లో ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి.
- అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు.. ఫస్ట్ నుంచి ఫిల్ చేసిన అన్ని వివరాలను మరొక్కసారి పరిశీలించి.. అంతా కరెక్ట్ అనుకున్నప్పుడు సబ్మిట్ చేయాలి.
- పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుని అప్లై చేస్తే.. మీ అప్లికేషన్ తొందరగా ప్రాసెస్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.
పాన్ కార్డు దరఖాస్తు టైమ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇక అంతే!
శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!