హైదరాబాద్ మలక్‌పేట పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ఓ అటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తుండగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తామంతా సైదాబాద్‌కు చెందిన వారని చెబుతున్నారు.