ETV Bharat / state

ప్రయాణికురాలి బ్యాగ్​ దొంగిలించిన ఆటో డ్రైవర్​ అరెస్ట్​ - arrest

తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ బ్యాగ్​ దొంగిలించిన ఆటో డ్రైవర్​ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకుని అతని నుంచి చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

ప్రయాణికురాలి బ్యాగ్​ దొంగిలించిన ఆటో డ్రైవర్​ అరెస్ట్​
author img

By

Published : Aug 14, 2019, 11:10 PM IST

తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ చేతి సంచిని దొంగిలించిన డ్రైవర్​ను నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 8న హిమాయత్​నగర్​కు చెందిన మాధవి అనే మహిళ లక్డీకాపుల్​ నుంచి ఇంటికొచ్చేందుకు ఆటో ఎక్కింది. ఇంటి వద్ద దిగిన తర్వాత ఆటోలో తన చేతి సంచిని మరచిపోయి దిగి వెళ్లిపోయింది. వెనక్కొచ్చి చూసేలోగా ఆటో డ్రైవర్​ బ్యాగ్​తో సహా ఉడాయించాడు. ఈ విషయంపై 9న నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. తాను పోగొట్టుకున్న బ్యాగ్​లో 3.5 తులాల బంగారం, రూ.42 వేల నగదు, ఓ చరవాణి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆటో వివరాలు సేకరించారు. ఆటో డ్రైవర్​ బి.బ్రహ్మంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి చరవాణి స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ప్రయాణికురాలి బ్యాగ్​ దొంగిలించిన ఆటో డ్రైవర్​ అరెస్ట్​

ఇదీ చూడండి: భార్యతో సంబంధం పెట్టుకున్నాడని హత్య...!

Intro:filename:

tg_adb_15_14_fro_got_braveheart_gold_medal_avb_ts10034

Body:గమనిక: సేమ్ ఫైల్ నేమ్ తో wrap.etvbharat.com lo ఇమేజెస్ పంపడం జరిగినది. తీసుకోగలరు.

కుమురం భీం జిల్లా
కాగజ్ నగర్
-------------------------

విది నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకుగాను కాగజ్ నగర్ అటవీ శాఖ అధికారిని చోలే అనిత ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైంది.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ అటవీ క్షేతంలో అధికారిణిగా పనిచేస్తున్న చోలే అనిత అడవులను కాపాడటంలో ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నందుకు అటవీ శాఖలో ప్రతిష్టాత్మకమైన కె.వి.ఎస్. బాబు (ఐ.ఎఫ్.ఎస్.) స్మారక బంగారు పథకం వరించింది.
రేపు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో అటవీ శాఖ ఉన్నతాధికారులు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రేంజి అధికారిని చోలే అనిత అందుకొనున్నారు.

గత జూన్ మాసం 30న జరిగిన సార్సాల పోడు భూముల ఘటనలో గ్రామస్తులు, తెరాస నాయకుడు కోనేరు కృష్ణ రావు మహిళ అధికారిని చోలే అనిత మరియు అటవీ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో గాయాలపాలైన అనిత కోలుకున్న అనంతరం ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్బంగా కాగజ్ నగర్ ఎఫ్డిఓ రాజా రమణ రెడ్డి మాట్లాడుతూ.. విధినిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గుర్తింపుగా రేంజి అధికారిని అనితకు ప్రతిష్టాత్మకమైన బంగారు పథకం లభించిందని తెలిపారు. ఈ పురస్కారనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 10మంది ఉద్యోగులను ప్రతిపాదించగా కాగజ్ నగర్ డివిజన్ నుండి అనితకు ప్రతిపాదించినట్లుగా తెలిపారు. ప్రతిష్టాత్మక కె.వి.ఎస్. బాబు పథకంతో పాటు 15000 నగదు, ప్రశంశపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.

బైట్:
కాగజ్ నగర్ ఎఫ్డిఓ:
రాజా రమణా రెడ్డి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.