ETV Bharat / state

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత'

బుద్ధి మాంద్యం(ఆటిజం) వ్యాధి కలిగిన చిన్నారుల పట్ల జాలి చూపకుండా వారికి చేయూతనివ్వాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు.

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత'
author img

By

Published : Nov 15, 2019, 3:03 PM IST

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత'

హైదరాబాద్​లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటిజం కలిగిన చిన్నారులు ర్యాంప్​ వాక్​ చేస్తూ సందడి చేశారు. మాధవ్​ ఆటిజం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్​ అలీ హాజరయ్యారు.

మిసెస్​ ఇండియా, తెలంగాణ క్వీన్స్​లతో కలిసి చిన్నారులు ర్యాంప్​ వాక్​ చేశారు. మామూలు పిల్లల కంటే ఈ పిల్లలు ప్రత్యేకమైన వారని మంత్రి మహమూద్​ అలీ అన్నారు. తన కుమారుడి లాంటి ప్రత్యేక చిన్నారుల కోసం ఈ ఫౌండేషన్​ స్థాపించడం అభినందనీయమని డా.సుమన్​ సరఫ్​ను కొనియాడారు.

తన కుమారుడు మాధవ్​ పడుతున్న బాధను చూసి ఈ సంస్థ నెలకొల్పినట్లు డాక్టర్​ సుమన్​ సరఫ్​ తెలిపారు. ఈ తరహా పిల్లల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

TG_Hyd_46_14_Hm On Autism Childrens Ramp Walk_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఆటిజం (బుద్ధి మాంద్యం) వ్యాధి కలిగిన చిన్నారులు బాలల దినోత్సవం సందర్భంగా... ర్యాంప్ వాక్ చేస్తూ హైదరాబాద్ లో సందడి చేశారు. మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో చిన్నారులు మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్స్ లతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. నారాయణ గూడ లో నిర్వహించిన కార్యక్రమంలో... హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాములు పిల్లలకంటే వీరు ప్రత్యేకమైన వారు అని... వారి పట్ల సమాజం జాలి చూపకుండా... చేయూత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వపరంగా వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ తరహ చిన్నారుల కోసం మాధవ్ ఫౌండేషన్ చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు డా.సుమన్ సరఫ్ తన కొడుకు పేరుతో మాధవ్ ఫౌండేషన్ స్థాపించి... తన కొడుకులాంటి ప్రత్యేక చిన్నారులకు సేవచేయడం అభినందనీయమన్నారు అనంతరం మాధవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా.సుమన్ సరఫ్ మాట్లాడుతూ... తన కొడుకు మాధవ్ పడుతున్న బాధను చూసి ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా ఈ తరహా పిల్లల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై తల్లిదండ్రులకు శిక్షణను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి విద్యాపరంగా కూడా ప్రత్యేక శిక్షణ అవసరం అన్నారు. ప్రభుత్వపరంగా సహకారం అందించి బుద్ధి మాంద్యం కలిగిన చిన్నారులను ఆదుకోవాలని కోరారు బైట్: మహమూద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి బైట్: డాక్టర్ సుమన్ సరఫ్, ఫౌండేషన్ అధ్యక్షురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.