ETV Bharat / state

'అధికారులు రూ.లక్షల్లో ఖర్చుపెట్టించారు.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు' - తెలంగాణ

Charities Issues: కొవిడ్‌ మొదటిదశలో కరోనా బాధితులకు ఆహారం సరఫరా చేయాలని, వారికి వసతి ఇవ్వాలని.. స్వచ్ఛంద సేవ చేస్తున్న సంస్థలు, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, వసతి గృహాల వెంటపడ్డారు అధికారులు. బాధితులకు భోజనం పెట్టండి.. వసతి కల్పించండి.. ఎంత ఖర్చైనా ఇచ్చేస్తామంటూ నమ్మించారు. రూ.లక్షలు ఖర్చుపెట్టించి.. ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదు. హామీ ఇచ్చిన వాళ్లు పదవులు మారడం, కొత్త వాళ్లు తెలీనట్లు వ్యవహరిస్తుండంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

authorities-used-charities
కరోనా సమయంలో భోజనం సప్లై చేస్తూ..
author img

By

Published : Dec 11, 2021, 6:58 AM IST

Charities Issues: అది కరోనా తొలిదశ కాలం.. ఎటుచూసినా తీవ్ర భయాందోళనలు.. కాలనీలకు కాలనీలే కట్టడి.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌. గుడులు, బడులతో పాటు దుకాణాలు అన్నీ బంద్‌. రవాణా నిలిపివేత. కొవిడ్‌ సోకిందని తెలిస్తే చాలు అయినవాళ్లు కూడా దగ్గరకు చేరదీయని కఠోర పరిస్థితులు. బాధితులకు భోజనం, అల్పాహారం, వసతి ఏర్పాట్లు ఎలా అనేది పెద్ద సమస్య. దీంతో అధికారులు అప్పటికే స్వచ్ఛంద సేవ చేస్తున్న సంస్థలు, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, ఆసుపత్రులు, వసతి గృహాలకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్ల వెంటపడ్డారు. ‘ముందు బాధితులకు భోజనం పెట్టండి. వసతి కల్పించండి. ఖర్చు బాధ్యత మాది..’ అని హామీ ఇచ్చారు. ఆ మాటలతో కొందరు రూ.లక్షలు ఖర్చు పెట్టారు. ఆ బిల్లుల కోసం ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హామీ ఇచ్చిన అధికారులు మారడం, కొత్త వాళ్లు తెలీనట్లు వ్యవహరిస్తుండంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

అప్పు తెచ్చి అన్నం పెట్టి..

భూపాలపల్లికి చెందిన రాజేశ్‌ ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగులకు భోజనం సరఫరా చేస్తుంటారు. కొవిడ్‌ తొలిదశలో రోగులకు భోజనాలు పెట్టమని అధికారులు అడిగారు. మొదటినెల బిల్లు రూ.లక్షన్నర ఇచ్చారు. తర్వాతి నుంచి పెండింగ్‌. 8 నెలలపాటు నిరంతరాయంగా రోగులకు భోజనం, మంచినీళ్లు అందించారు రాజేశ్‌. భార్య బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారు. రూ. 4 వడ్డీకి మరో రూ. 3 లక్షల అప్పు చేశారు. రోజూ కరోనా రోగుల మధ్యే ఉండడంతో రెండుసార్లు కొవిడ్‌ బారిన పడ్డారాయన. ఆయన ద్వారా తల్లిదండ్రులకూ సోకింది. తండ్రి వరంగల్‌ ఎంజీఎంలో మూడు నెలలున్నారు. ఇప్పుడు బిల్లు రాకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక తహశీల్దార్‌ను సంప్రదిస్తే అప్పుడు తాను అక్కడ లేనని చెప్పారు.

రూ. 10 లక్షల బిల్లు రావాలి

రాజేశ్

‘‘కలెక్టర్‌ ఆదేశాలంటూ ఆర్డీవో గణేశ్‌, తహశీల్దార్‌ అశోక్‌కుమార్‌ వచ్చి క్వారంటైన్‌ సెంటర్లో కరోనా రోగులకు భోజనం పెట్టమని ఒత్తిడిచేశారు. భూపాలపల్లిలో 100 పడకల ఆసుపత్రిలో ఉపాధి చూపిస్తామని చెప్పడంతో జీవితంలో స్థిరపడొచ్చన్న ఆశతో ప్రాణాలకు తెగించా. పీపీఈ కిట్లు వేసుకుని భోజనాలు వండి, వడ్డించా. మా కాలనీవాసులు భయంతో నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు. 8 నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉన్నా. రూ.10 లక్షల బిల్లు రావాలి. అప్పటి కలెక్టర్‌, తర్వాత కలెక్టరూ బదిలీ అయ్యారు.’’

- రాజేశ్‌, భూపాలపల్లి

నాలుగువేల మందికి వసతి కల్పించినా!

.

ఆదిలాబాద్‌ జిల్లా బెల్లూరుకు చెందిన నవనీత్‌కు నాలుగెకరాల్లో ఫంక్షన్‌ హాల్‌ ఉంది. వలస కార్మికులకు వసతి కావాలని అధికారులు అడగడంతో 2020 మార్చి 22 నుంచి 50 రోజుల పాటు వారికి ఇచ్చారు. కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులు, ఫంక్షన్‌ హాల్‌ అద్దె ఇస్తామని చెప్పిన అధికారులు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బాధితుడు వాపోతున్నారు. ‘ఫంక్షన్‌హాల్‌ అద్దె రోజుకు రూ. 60 వేలు. కరెంటు బిల్లు, సిబ్బంది నిర్వహణకే రూ. 20 వేల ఖర్చు. దాదాపు నాలుగువేల మందికి వసతి కల్పించా. అప్పటి జిల్లా కలెక్టర్‌ దేవసేనను, డీఈఓను కలిశాం. కరెంటు బిల్లుల వరకు చూస్తామన్నారు కానీ ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్‌, డీఈఓ బదిలీ అయ్యారు’ అని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయంపై ఆదిలాబాద్‌ డీఈఓ ప్రణీతను సంప్రదించగా.. అప్పుడు తాను అక్కడ విధుల్లో లేనని చెప్పారు.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్​ పట్ల తగ్గుతున్న ప్రజల ఆదరణ... నిర్లక్ష్యం వద్దని చెబుతున్న సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.