ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీని దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు. మరిన్ని కొండచరియలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించి ముందస్తుచర్యల్లో భాగంగా.. క్యూలైన్లలో మార్పులు చేశారు. ఘటనాస్థలానికి సమీపంలో భక్తుల కోసం వేసిన టెంట్లను.. అలాగే కొండపై ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను కూడా అధికారులు తొలగించారు.
కొండపై భక్తులు వెళ్లే పలు క్యూలైన్లలో మార్పులు చేశారు. దర్శనం అనంతరం ఘాట్ రోడ్డు పైకి తిరిగి వెళ్లే మార్గాన్ని మూసివేసి.. శివాలయం మెట్ల మీదుగా కొండ కిందకు వెళ్లేలా మార్పులు చేశారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు'