ETV Bharat / state

'సహకారం అందిస్తాం'

అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియా సాంకేతికను ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్​.కె.జోషి ఆ దేశ ప్రతినిధులను కోరారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

పరస్పర సహకారానికి కృషి
author img

By

Published : Feb 27, 2019, 5:56 PM IST

సీఎస్​తో ఆస్ట్రేలియా మంత్రుల బృందం భేటీ
భారత్​, ఆస్ట్రేలియాల మధ్య విద్య, ఉపాధి శిక్షణ, వ్యవసాయం, ఐటీ రంగాల్లో సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన కార్యదర్శి ఎస్.​కె.జోషి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా విద్య, మానవ వనరుల మంత్రి సెలెనా ఊయిబో నేతృత్వంలోని బృందం సచివాలయంలో సీఎస్​ను కలిసింది. తెలంగాణలో అంకుర సంస్థలకు చాలా అవకాశాలు ఉన్నాయని... వారికి అవసరమైన శిక్షణ అందించడంలో సహకారం అందించాలని జోషి విజ్ఞప్తి చేశారు.

మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో వీహబ్​ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు సీఎస్​ బృంద సభ్యులకు తెలిపారు. ఇంజినీరింగ్​ విద్యలో కొత్త సాంకేతిక అంశాలపై ఆస్ట్రేలియా సహకారం కావాలని సాంకేతిక విద్యా కమిషనర్​ నవీన్​ మిట్టల్​ పేర్కొన్నారు.

సహకారానికి సంసిద్ధత

ఆస్ట్రేలియా, తెలంగాణ మధ్య వివిధ రంగాల్లో సహకారానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ మంత్రి సెలెనా ఊయిబో తెలిపారు. కలిసి పనిచేయడానికి అవసరమైన ఒప్పందాల ఖరారుకు కృషి చేస్తామని అన్నారు.

ఇవీ చదవండి :స్క్రీనింగ్​ కమిటీ భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.