ETV Bharat / state

దొంగ ఓట్లపై ఆడియో కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ - tirupati latest news

ఏపీ తిరుపతి ఉపఎన్నికలో పెద్ద ఎత్తున స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో నిజం లేదని వైకాపా కొట్టివారేసింది. కానీ దొంగ ఓట్లకు సంబంధించి ఓ ఆడియే టేపు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

fake votes audio call
దొంగ ఓట్లపై ఆడియో కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
author img

By

Published : Apr 20, 2021, 10:44 AM IST

ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల నుంచి స్థానికేతరులను పెద్ద ఎత్తున తరలించి దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని అధికార పార్టీ నేతలు కొట్టివేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపు చర్చనీయాంశమైంది. వైకాపాకు చెందిన ఒక నేతతో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లుగా ఉన్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ సంభాషణ ఇలా సాగింది.

ప్రజాప్రతినిధి: ఇప్పుడు ఇంత రాత్రిలో కష్టం. వచ్చినా సమయం సరిపోదని మన వాళ్ల ఫీలింగ్‌. ఓటింగ్‌ సమయం సరిపోదు.

నేత: మనకు తొమ్మిది గంటలే కదా ప్రయాణం.

ప్రజాప్రతినిధి: లేదు హడావుడి అయిపోతుంది. 450 మందికి ఏడు బస్సులు కాదు 12 బస్సులు కావాలి.

నేత: 50 మంది పట్టే కెపాసిటీ సార్‌

ప్రజాప్రతినిధి: అయినా తొమ్మిది బస్సులు కావాలి. ఇప్పుడు 9 బస్సుల్లో వస్తే అన్నీ ఆపుతారు. మధ్యలో చాలా సమస్యలుంటాయి.

నేత: మన టీం వస్తున్నారు కదా ఎంప్లాయీస్‌ వాళ్లు సమన్వయం చేసుకునేందుకు.

ప్రజాప్రతినిధి: అది ముందు చూసుకోవాల్సి ఉంది. రెండు రోజుల ముందు ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంది.

నేత: ముందుగానే చెప్పాం సార్‌.

ప్రజాప్రతినిధి: నాతో ఎవరూ మాట్లాడలేదు.

నేత: నేను సార్‌కు చెప్పాం. మీకు పంపించామని చెప్పారు.

ప్రజాప్రతినిధి: ఇప్పుడు అందరినీ 4గంటలకు నిద్రలేపి బయల్దేరించడం ఎందుకు? ఈ 400 ఓట్లు ఇక్కడ వేయించుకుంటాంలే. వాళ్ల ఓట్లు ఎవరో ఒకరితో వేయించుకుందాంలే. ఎందుకు పాపం శ్రమ. ఆ ఓట్లు ఇక్కడ వేయించుకోవచ్చులే.

ఇవీ చూడండి: మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​కు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.