సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో అపహరణయత్నం ఘటన కలకలం రేపింది. ఓ మహిళ తమ బంధువులకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల చూడడానికి ఆస్పత్రికి వచ్చింది. తిరిగి వెళ్లడానికి తనకొడుకుతో రోడ్డుపై నిల్చుని ఉంది. అటువైపుగా వస్తున్న ఒక దుండగుడు మహిళ చేతుల్లోని బాలున్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. మహిళ ఒక్కసారిగా గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న వారంతా వచ్చి అతన్ని పట్టుకుని బాబును విడిపించారు. అతడిని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ దుండగుడు ఎక్కడినుండి వచ్చాడు ఆ బాలుడిని అపహరించేందుకు ఎందుకు యత్నించాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : లద్దాఖ్‌లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!