హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా, తెరాస నేతల మధ్య ఘర్షణ జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా.... నేతలపై తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇందులో భాజపా నేతల కారు అద్దాలు ధ్వంసం కాగా... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే.. దాడి తానే చేయించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని... ఖైరతాబాద్ తెరాస అభ్యర్థి విజయ రెడ్డి తెలిపారు.
బండి సంజయ్‌పై హత్యాయత్నం జరగిందని కార్యకర్తలు ఆరోపించారు. అయితే... అలాంటిదేమి లేదని మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. సంజయ్ నెక్లెస్‌రోడ్డులో ఉన్నప్పుడు తెరాస నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి అనుచరులు వాహనం అడ్డుకునే యత్నం చేశారని వివరించారు. కానీ... అప్పటికే సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
బండి సంజయ్ కారుపై దాడికి యత్నించటాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెరాస అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా గెలుస్తోందనే తెరాస నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మద్యం, నగదు పంపిణీ చేసి... నీతులు చెబుతున్నారన్నారు.
దాడి ఘటనను నిరసిస్తూ... నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతోందని వెల్లడించారు.
ఇవీచూడండి: నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం