రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి మౌలాలి కమాన్ వద్ద విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ జాఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనం పై ముగ్గురు కూర్చొని వెళ్తుండగా ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన వాహనదారుడు పోలీస్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత పోలీస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'చారిత్రక కట్టడాలపై మాకూ గౌరవం ఉంది'