ETV Bharat / state

రైతుల పేరిట దారుణం.. బ్యాంకుల నుంచి కోట్లలో అప్పులు

రైతుల పేరిట బ్యాంకుల నుంచి రూ.కోట్లలో అప్పులు చేసింది ఓ విత్తన సంస్థ. పంటలు పండించి ఇచ్చిన రైతులకు బకాయిలు చెల్లించక, బ్యాంకులకూ కట్టక.. నష్టపోయామంటూ చేతులెత్తేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థపై.. అప్పులిచ్చిన బ్యాంకులు ‘జాతీయ రుణ రికవరీ ట్రైబ్యునల్‌’లో కేసులు వేశాయి.

atrocities in the name of farmers super agree seeds debts crores of rupees from banks in hyderabad
రైతుల పేరిట దారుణం.. బ్యాంకుల నుంచి కోట్లలో అప్పులు
author img

By

Published : Feb 24, 2021, 5:43 AM IST

రైతులకు వివరాలు చెప్పకుండానే వారి పేరుతో బ్యాంకుల్లో కోట్ల రూపాయలు తీసుకున్న విత్తన సంస్థ ఆ సొమ్ములు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. కంపెనీ నష్టాల్లో ఉందంటూ విత్తన పంటలు పండించి ఇచ్చిన రైతులకూ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు, వారి తరఫున ఏజెంట్లుగా పనిచేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘సూపర్‌ అగ్రి సీడ్స్‌’ అనే సంస్థ హైబ్రీడ్‌ వరి, పత్తి, కూరగాయల పంటల విత్తనాలను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఇందుకోసం పలు జిల్లాల్లో రైతులతో విత్తన పంటలు పండిస్తోంది. ఈ రైతులకు మూల విత్తనాలిచ్చి ఒప్పందాలు చేసుకోవడానికి, పంటను తిరిగి కంపెనీకి అప్పజెప్పడానికి ప్రతి గ్రామంలో కొందరు చురుకైన రైతులను ఏజెంట్లుగా పెట్టుకుంది. విత్తన రైతులకు డబ్బులివ్వాలంటూ రెండు బ్యాంకుల నుంచి ఏజెంట్ల పేరిట రూ.28 కోట్ల రుణాలు తీసుకుంది. తీరా విత్తన రైతులకు సొమ్ము చెల్లించకపోగా.. బ్యాంకులకూ కట్టకపోవడంతో తమపై రుణ ఎగవేతదారులుగా ముద్ర పడిందని ఏజెంట్లుగా నియమితులైన రైతులు ఆందోళన చెందుతున్నారు.

సూపర్‌ అగ్రి సీడ్స్‌ సంస్థ మొత్తం 30 మంది రైతుల పేర్లపై ‘కార్పొరేట్‌ ప్రోగ్రాం’ పేరుతో రుణాలు తీసుకుంది. అందుకు పెట్టిన దరఖాస్తుల్లో రైతుల పూర్తి వివరాలు ఇవ్వకుండా ఫోన్‌ నెంబరు, ఫొటో, గ్రామం పేరు, ఇంటి చిరునామా మాత్రమే ఇచ్చింది. ‘కంపెనీతో మంచి సంబంధాలున్నాయి. అందుకే పూర్తి వివరాలు ఇవ్వలేదు’ అని దరఖాస్తుల్లో రాశారు. ఎవరి పేరుతో ఎంత రుణం తీసుకున్నారో రైతులకు చెప్పనేలేదు.

ఉదాహరణకు ఒక దరఖాస్తులో సంజీవ్‌, రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు పెట్టి రూ.4 కోట్ల రుణం మంజూరు చేశారు. మరో దరఖాస్తులో మహేశ్‌, వీరారెడ్డి అనే ఇద్దరి పేర్లతో మరో రూ.3 కోట్ల రుణం మంజూరు చేశారు. ఈ రెండు దరఖాస్తుల్లో పేర్కొన్న రెడ్డి, వీరారెడ్డి పేరు ఎదురుగా ఒకే సెల్‌ఫోన్‌ నెంబరు రాశారు. అంటే ఈ రెండు పేర్లూ ఒకే వ్యక్తివని ఫోన్‌ నెంబర్‌ ద్వారా తెలుస్తోంది. కొన్ని దరఖాస్తుల్లో ఇద్దరు రైతుల పేర్లను రాసి ఒకే ఫొటో పెట్టారు. బ్యాంకుల నుంచి తీసుకుని సొమ్ములు ఖర్చయ్యాక బకాయిలు తిరిగి చెల్లించలేక నష్టాల్లో ఉన్నామంటూ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో అప్పులిచ్చిన బ్యాంకులు ‘జాతీయ రుణ రికవరీ ట్రైబ్యునల్‌’లో కేసులు వేశాయి. మరోవైపు రైతులను డబ్బు కట్టమని అడుగుతున్నాయి. ఏ వ్యక్తికైనా రుణం ఇవ్వాలంటే బ్యాంకులు ఆన్‌లైన్‌లో సిబిల్‌ రిపోర్టును పరిశీలిస్తాయి. ఆ వ్యక్తి ఏయే బ్యాంకుల్లో ఎన్ని రుణాలు తీసుకున్నారు, బకాయిలు కట్టారా, ఎగవేశారా అనే వివరాలను బట్టే రుణాలు మంజూరు చేస్తాయి. ఈ కంపెనీ తీసుకున్న రుణాలకు బాధ్యులైన రైతులందరు ఎగవేతదారులని సిబిల్‌ నివేదికలో కనిపిస్తుండడంతో.. వారికి పంట రుణాలను, ఇతర రుణాలను బ్యాంకులు ఇవ్వడం లేదు. దీంతో ఏజెంట్లుగా పనిచేసినవారు రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పంటలు పండించి ఇచ్చిన రైతులకు బకాయిలు చెల్లించడానికి తగిన సొమ్ము తమ వద్ద లేదని.. ఇందుకు బ్యాంకు నుంచి కంపెనీ రుణం తీసుకుంటున్నామంటూ దరఖాస్తుల్లో తమ సంతకాలు తీసుకున్నారని ఏజెంట్లుగా పనిచేసిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులను వేధించవద్దని బ్యాంకులకు చెప్పాం

విత్తన సంస్థ యాజమాన్యాన్ని, బ్యాంకుల ప్రతినిధులను కమిషన్‌ పిలిచి విచారిస్తే రైతుల పేర్లతోనే రూ.కోట్ల రుణాలిచ్చిన బాగోతం బయటపడింది. రుణ రికవరీ ట్రైబ్యునల్‌లో కేసు ఉందని.. ఈ రుణాల బాధ్యత తమదేనని కంపెనీ యాజమాన్యం చెప్పింది. కార్పొరేట్‌ ప్రోగ్రాం పేరుతో ఈ రుణాలు తీసుకున్నా రైతులకు పూర్తి వివరాలు చెప్పకుండా.. వారి పేర్లతో ఎలా ఇస్తారని బ్యాంకులను ప్రశ్నించాం. పంట సాగుకు రూ.50 వేల పంట రుణాలు ఇవ్వమంటేనే సరిగా ఇవ్వకుండా బ్యాంకులు సతాయిస్తున్నాయి. ఇలా కంపెనీకి కోట్ల కొద్ది ఇవ్వడం దారుణం. రుణ రికవరీ ట్రైబ్యునల్‌లో కేసు తీర్పు ఎలా వస్తుందో చూసి.. దీనిపై కమిషన్‌ తగిన తీర్పు ఇస్తుంది. రైతులను బకాయిలు కట్టాలంటూ వేధించవద్దని బ్యాంకులను హెచ్చరించాం.

- రుణ ఉపశమన కమిషన్‌ సభ్యులు.

1500 మంది రైతులకు డబ్బులివ్వాలి

విత్తన కంపెనీ నా పేరుతో రూ.5 కోట్ల రుణం తీసుకుందనే విషయం నాకు ఇంతవరకూ చెప్పలేదు. ఈ సంస్థ తరఫున మా చుట్టుపక్కల గ్రామాల్లో 1,500 మంది రైతులతో హైబ్రీడ్‌ వరి విత్తనాల సాగుకు నన్ను ఏజెంట్‌గా పనిచేయమన్నారు. తీరా పంట పండించి విత్తనాలిచ్చాక రైతులకు డబ్బులివ్వలేదు. మొత్తం రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంది. పలుమార్లు గట్టిగా అడిగితే సంతకాలు తీసుకుని రూ.80 లక్షలు ఇచ్చారు. ఇంకా రూ.కోటీ 20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. విత్తన రైతులు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నాలాగా మరికొందరు రైతులు ఏజెంట్లుగా పనిచేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

-జి.సంపత్‌, విత్తన రైతు, కరీంనగర్‌ జిల్లా.

నా పేరుతో 5 కోట్ల రుణం తీసుకున్న విషయం చెప్పలేదు

నాకు 3.5 ఎకరాల భూమి ఉంది. వరి సాగు చేస్తున్నాను. సూపర్‌ అగ్రి సీడ్స్‌ విత్తన సంస్థ తరఫున మా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులతో విత్తన పంటల సాగు చేయించేందుకు ఏజెంటుగా పనిచేయమన్నారు. నా పేరుతో కంపెనీ రూ.5 కోట్ల రుణం తీసుకున్న సంగతి చెప్పలేదు. విత్తన పంటలున రైతులకు రూ.90 లక్షలు ఇవ్వాలి. వాటి కోసం వారు నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే 3 ఎకరాల భూమికి ప్రభుత్వం కాల్వ తవ్వకానికి పరిహారంగా ఇచ్చిన సొమ్మును చెల్లించాను. రైతుల సొమ్ము గురించి అడిగితే సంస్థ ప్రతినిధులు రూ.25 లక్షలిచ్చి సంతకాలు చేయించుకున్నారు. నా పేరుతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికే ఆ సంతకాలని చెప్పలేదు. నాకు మా గ్రామంలోని సహకార బ్యాంకులో పంట రుణం ఇచ్చారు. మళ్లీ విడిగా నా పేరుతో రూ.5 కోట్లు ఇచ్చేటప్పుడు బ్యాంకు అధికారులు నాకు ఎందుకు చెప్పలేదు? రైతుల సొమ్ము ఇప్పించాలని అడిగితే కంపెనీ నష్టపోయిందని, డబ్బు లేదని చెబుతున్నారు. దీనిపై రుణ ఉపశమన కమిషన్‌లో ఫిర్యాదు చేశాను.

-జి.కుమారస్వామి, విత్తన రైతు, సిద్దిపేట జిల్లా.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై నేతలతో కేటీఆర్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.