సాయం పేరిట మోసం
ఏటీఎం గురించి సరిగ్గా తెలియని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని... వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ కార్డ్ నంబరును తన ఫోన్లో నమోదు చేసుకునేవారు. కార్డు వెనుక ఉండే సీవీవీ నంబరును, కార్డు ముగింపు తేదీలు కాజేసి... రమ్మీ ఆన్లైన్లో ఎంటర్ చేసేవాడు. వారి ఫోన్కు ఓటీపీ రాగానే దాన్ని చూసి తన ఫోన్లో నమోదు చేసి నగదు తన ఖాతాకు బదిలీ చేసుకునేవాడు. సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో తన ఖాతా నుంచి నగదు మాయమైందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగదు మళ్లించిన రమ్మీ ఖాతా ఆధారంగా నిందితుడి చిరునామా గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటి వరకూ ఇలాంటి 7 నేరాలకు పాల్పడినట్లు నిందితుడి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక కేసులో జైలుకూ వెళ్లొచ్చాడని దర్యాప్తులో తేలింది.
జాగ్రత్త వహించండి
ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు జరుపుతున్నప్పుడు ఇతరులను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు ఎవరకీ కనబడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎవరితోనూ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు మౌఖికంగా, ఫోన్, మెయిల్ ద్వారా పంచుకోవద్దని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :