ETV Bharat / state

ఆస్తమాతో అవస్థ పడుతున్నారా.. అయితే మీకో శుభవార్త - telangana latest news

నిశ్వాసలను ఊపిరి అంటారు. ఒక్క క్షణం ఊపిరి అందక పోతే ఎంతటి మనిషి అయినా ఉక్కిరిబిక్కిరి అయ్యిపోతాడు. ఆస్తమా బాధితుల కొందరిలో అవస్థలు వర్ణణాతీతంగా ఉంటాయి.

ఆస్తమా బాధితులకు శుభవార్త.
ఆస్తమా బాధితులకు శుభవార్త.
author img

By

Published : Aug 3, 2020, 12:52 PM IST

రెండేళ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నా. ఈ వర్షాకాలంలో న్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్ఛు ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందగలను? - ఓ సోదరి

ఈ సమస్య కొంతమందిలో వాతావరణాన్ని బట్టి ఎక్కువ అవుతుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు తిన్నప్పుడు దీనికి సంబంధించిన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మానసిక ఆందోళన ఉన్నప్పుడు కూడా ఆస్త్మా లక్షణాలు కనిపిస్తాయి.

* కఫదోషాన్ని పెంచే ఆహారాన్ని తగ్గించుకోవాలి. చల్లనినీరు, పానీయాలు, స్వీట్లు, పాలతో తయారుచేసే పాయసం వంటివి తీసుకోకూడదు. పెరుగు, మీగడ, కేకులు, క్రీం, బిస్కట్లు వంటివి తగ్గించుకోవాలి. ఆహారంలో చేదుగా, కారంగా ఉండే పదార్థాలు తీసుకుంటే మంచిది. ఇంట్లో బూజులూ, దుమ్ము చేరకుండా జాగ్రత్తపడాలి. బొద్దింకలు, పురుగులు, తడి లేకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అనులోమవిలోమ, కపాలభాతి, సూర్యభేది, ఉజ్జాయి ప్రాణాయామం సాధన చేయాలి. వీటితో ఊపిరి తిత్తులు శక్తిమంతమవుతాయి.

* శొంఠి కొమ్ములను నేతిలో వేయించి చల్లారిన తరువాత పొడిగా చేయాలి. అలాగే పిప్పళ్లను, మిరియాలను కూడా విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ మూడు రకాల పొడులను సమభాగాలుగా కలిపి పల్చని వస్త్రంతో జల్లించి, వచ్చిన చూర్ణాన్ని పొడి సీసాలో భద్రపరుచుకోవాలి. చెంచాడు చూర్ణంలో చెంచాడు తేనె కలిపి రెండు పూటలా ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి. చెంచాడు వెల్లుల్లి ముద్దకు కప్పు పాలు, నాలుగు కప్పుల నీటిని చేర్చి నీరు ఇగిరేవరకు మరిగించి వడబోసి ఆ పాలను గోరువెచ్చగా తాగాలి. ఆస్తమా సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. వాముని నల్లగా మాడేలా వేయించి పల్చని వస్త్రంలో మూటకట్టి వాసన చూడొచ్ఛు అదే మూటతో ఛాతీపై కాపడం పెట్టుకోవచ్ఛు ఈ రెండు విధాలుగా వాముని వాడటం వల్ల తక్షణ ఉపశమనం పొందొచ్ఛు.

ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.