ETV Bharat / state

ప్రయాణికులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా

కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన ఆర్టీసీ... ఆదాయార్జనకు సరికొత్త మార్గంలో దూసుకుపోతోంది. యువతకు ఉపాధి కోసం డ్రైవింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తోంది. కొవిడ్‌ భయంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో... డ్యూటీలు లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కార్గో ద్వారా పని కల్పిస్తోంది. అటు బస్‌పాసుల జారీ బాధ్యత సైతం ఆర్టీసీ తీసుకోవడం సంస్థకు మరింత మేలు చేకూరుస్తోంది.

Assurance to employees who have lost passengers or duties
ప్రయాణీకులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా
author img

By

Published : Nov 15, 2020, 6:53 AM IST

ప్రయాణీకులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా

కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు... అందుబాటులో ఉన్న అన్నీ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గత ఆరేళ్లుగా ప్రైవేటు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్‌పాసుల జారీ ప్రక్రియను సంస్థ తన అధీనంలోకి తీసుకుంది. గతేడాది బస్‌పాసుల జారీతో 3 కోట్ల36 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు డ్రైవింగ్‌ పాఠశాలలకు అనుమతి లభించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విశ్వాసంతో యువత నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.

మన్ననలు పొందుతోంది

సమ్మె అనంతరం కార్గో సేవలు ప్రారంభించిన ఆర్టీసీ అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రైవేటు కొరియర్లతో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉండటం.. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకొనే అవకాశం ఉండటం వల్ల... ప్రజలు ఆర్టీసీ పట్ల ఆకర్షితులవుతున్నారు. కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళలకు కొరియర్‌తోపాటు కార్గో సేవలు అప్పగించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా సర్వీసులు రద్దయి ఇబ్బందులు పడ్డ తమకు ఇప్పుడు చేతినిండా పనిదొరుకుతోందని అంటున్నారు.

సకాలంలో వస్తువులు

ఆర్టీసీ కార్గో సేవల పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో వస్తువులు గమ్యస్థానానికి చేరడం సహా ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు లభిస్తున్నాయని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ నూతన ప్రయోగాలతో ఆదాయం పెరగడం సహా ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయని ఉద్యోగులు, ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : దీపకాంతుల నడుమ కళకళలాడిన పల్లెలు, పట్టణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.