ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం - corona tests in assembly

వర్షాకాల సమావేశాలకు సర్వం సన్నద్ధమైంది. రేపట్నుంచి శాసనపరిషత్తు, శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 19 పనిదినాలు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తుండగా... కరోనా నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర వైఖరి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, తదితర అంశాలు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ఉభయసభల ముందుకు రానుంది.

assesmbly sessions started from tomorrow
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం
author img

By

Published : Sep 6, 2020, 6:04 PM IST

వర్షాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అటు శాసనపరిషత్తు, ఇటు శాసనసభ రెండూ వేర్వేరుగా సమావేశం కానున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతోన్న సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉభయ సభల ప్రాంగణాల్లో శానిటైజర్ యంత్రాలు, థర్మల్ స్కానర్ కెమెరాలు సహా అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రాంగణాల్లోకి మాస్క్​ను తప్పనిసరి చేశారు. సభ్యులు సహా అధికారులు, సిబ్బంది, అందరూ విధిగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశారు. నెగెటివ్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రత్యేక చర్యలు

గత మూడు రోజులుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. సభాపతులు, పలువురు, మంత్రులు, సభ్యులు, అధికారులు, సిబ్బంది ఇప్పటికే కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసుకున్నారు. సమావేశాలు కొనసాగుతున్నన్ని రోజులు పరీక్షా కేంద్రాలు కొనసాగుతాయి. ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బందితో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అటు సభలోనూ సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో 48 సీట్లను అదనంగా ఏర్పాటు చేశారు. సందర్శకులకు అనుమతి లేదు. మీడియా పాయింట్​కు కూడా అనుమతించడం లేదు.

19 పనిదినాలు ఉండేలా సమావేశాలు

తొలిరోజు కేవలం సంతాపాలకు మాత్రమే ఉభయసభలు పరిమితమవుతాయి. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉభయసభలు సంతాపం తెలుపుతాయి. దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డికి శాసనసభలో సంతాపం ప్రకటిస్తారు. సంతాపాల అనంతరం ఉభయసభలు మరుసటి రోజుకు వాయిదా పడతాయి. ఆ తర్వాత రెండు సభల సభావ్యవహారాల సలహాసంఘాలు విడిగా సమావేశమై పనిదినాలు, ఎజెండాను ఖరారు చేస్తాయి. కనీసం 19 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన.

పలు అంశాలపై చర్చ

కరోనా పరిస్థితులు, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం, భారీవర్షాలు-పంటనష్టం, నియంత్రితసాగు, పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, జీఎస్టీ పరిహారం, రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కేంద్ర వైఖరి సహా వివిధ అంశాలు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. కొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం ఉభయసభల్లో ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. గతంలో జారీచేసిన ఆర్డినెన్స్​ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఉభయసభల ముందుకు రానుంది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.

ఇవీ చూడండి: ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.