వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ఖర్చు చేసినట్టు దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చుపెట్టట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.
మిషన్ కాళేశ్వరం
ఈ ఏడాది నీటి పారుదల రంగానికి రూ.22,500కోట్లు కేటాయించారు.దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర జల సంఘం ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే రైతులకు నీళ్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 20వేల చెరువులను ఇప్పటికే పునరుద్ధరించామని తెలిపారు.