ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్రం ఏం చెప్పిందంటే..? - BJP MP GVL Narasimha Rao

Assembly Seats Increase in Telangana : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. 2031లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది.

2031 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు
2031 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు
author img

By

Published : Jul 28, 2022, 6:42 AM IST

Updated : Jul 28, 2022, 6:58 AM IST

Assembly Seats Increase in Telangana : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని సవరించనంత వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.

ఆర్టికల్‌ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంత వరకూ పెంచడానికి వీల్లేదని పేర్కొంటోందని చెప్పారు. అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్‌ 26కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2026 తర్వాత జనాభా లెక్కలు అంటే 2031లో జరుగుతాయి. ఆ లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ఎంత వేగంగా చేసినా 2034 లేదా 2039 ఎన్నికల నాటికే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Last Updated : Jul 28, 2022, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.