Remove of a tumor from patient kidney: తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా మూత్ర పిండాల నుంచి 10కిలోల బరువున్న కణితిని తొలగించినట్టు ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు ప్రకటించారు. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సను చేయటం రెండో సారిగా తెలిపారు. ఏఐఎన్యూకి చెందిన డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ తైఫ్ బెండిగెరి, డాక్టర్ కె.రాజేష్ రెడ్డి బృందం ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసింది.
కడప జిల్లాకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి పొత్తికడుపులో వాపుతో ఆసుపత్రికి రాగా.. స్కానింగ్ చేసిన వైద్యులు రోగి కడపులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఎడమవైపు కిడ్నీలో ఏర్పడిన ఈ కణితి కారణంగా కడుపులోని పేగులు సైతం పూర్తిగా కుడివైపుకి జరిగినట్టు పేర్కొన్నారు. కణితి పరిమాణం పెద్దదిగా ఉండటంతో ఓపెన్ సర్జరీ చేసి తొలగించామని.. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఇవీ చదవండి: