రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారు అమెరికాకు చెందిన మయో క్లినిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, మయో క్లినిక్ ఎండీ డేవిడ్ హయాస్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. భారతదేశంలోనే మయో క్లినిక్స్‌తో కలిసి పనిచేయనున్న మొట్టమొదటి సంస్థ ఏఐజీ కావడం విశేషం. మయో క్లినిక్ వైద్యులతో లైవ్ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ... రివ్యూ చేయనున్నారు. ఫలితంగా రోగులకు గతంతో పోలిస్తే మరింత మెరుగైన వైద్యులు సేవలు అందే అవకాశం ఉందని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ