ETV Bharat / state

బలకాపుర్ నాలా పునరుద్ధరణ పనులపై అసదుద్దీన్ సమీక్ష - hyderabad latest news

వర్షాకాలం రానుండటంతో హైదరాబాద్ బలకపుర్ నాలా కోసం శాశ్వత పరిష్కారం చూపాలని ఎంఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికారులకు సూచించారు. నాలా పునరుద్ధరణపై ఆయన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

Asaduddin oyc reviews balakapur nala restoration work

author img

By

Published : May 21, 2021, 7:16 PM IST

హైదరాబాద్ బలకపుర్ నాలా కోసం శాశ్వత పరిష్కారం చూపాలని ఎంఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికారులకు సూచించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో నాలాపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో టోలి చౌకి లోని కొన్ని కాలనీలు నీట మునుగుతుండటంతో.. వాటికి శాశ్వత పరిష్కారం చేయాలని సూచించారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా నాలను సరి చేస్తామని తెలిపారు. నాలా కు సంబంధించిన మ్యాప్ ను అధికారులు ఎంపీకి చూపించారు. మిల్ట్రీ ఏరియాలోకి వెళ్లి మురికి నాళాలను పర్యవేక్షించాలని అనుకున్నా... మిలటరీ అధికారులు నిరాకరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెనుతిరిగారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ధాన్యం అమ్ముకోలేక రైతుల గోస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.