ETV Bharat / state

టీఎస్​రెడ్కో కుంభకోణంలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం - bio gas scandal scam updates

టీఎస్​రెడ్కో కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీఐడీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమార్కుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నలుగురిని జైలుకు పంపగా.. మరో ఏడుగురిని అరెస్టు చేశారు.

bio gas scandal
టీఎస్​రెడ్కో కుంభకోణంలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం
author img

By

Published : Jan 31, 2020, 7:33 AM IST

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బయోగ్యాస్, సోలార్ వ్యక్తిగత ప్లాంట్ల నిర్మాణ లబ్ధిదారుల పేరిట మంజూరైన రాయితీ సొమ్మును కొట్టేసిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమార్కుల సంఖ్య పెరుగుతోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే నలుగురు నిందితుల్ని సీఐడీ పోలీసులు కటకటాల్లోకి పంపగా.. తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏజెంట్లుగా..

లబ్ధిదారుల్ని ప్లాంట్ల నిర్మాణానికి సమాయత్తం చేసి అవగాహన కల్పించాల్సిన స్థానంలో ఉన్న బయోగ్యాస్ డెవలప్​మెంట్ ఏజెంట్ పాత్ర నిగ్గు తేలగా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరంతా 2014 -16 కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏజెంట్లుగా పని చేసిన సమయంలో ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.

సింహభాగం మేనేజర్లకే వాటాలు..

ఏజెంట్లు కొట్టేసిన రాయితీ సొమ్ములో సింహభాగం వాటాల్ని సంస్థ జిల్లా మేనేజర్లకే పంచినట్లు సీఐడీ బృందం గుర్తించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుపుతున్న తనిఖీల క్రమంలో ఈ వ్యవహారమంతా బహిర్గతమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేనేజర్ ప్రకాశ్ పోలీసులకు చిక్కగా.. మరో కీలక నిందితుడైన కరీంనగర్ అప్పటి మేనేజర్ కోసం గాలిస్తున్నారు.

రాయితీ పేరిట మభ్యపెట్టి..

బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించుకునే లబ్ధిదారులకు వచ్చే రూ. 9వేల వరకు వచ్చే రాయితీని కొట్టేసేందుకు మేనేజర్లు.. ఏజెంట్లతో కలిసి పన్నాగం పన్నారు. గేదెలు ఉన్న అమాయక రైతులను రాయితీ పేరిట మభ్య పెట్టి వారి వద్ద ఉన్న ఆధార్‌కార్డు నకలు ప్రతుల్ని తీసుకున్నారు. వాటి ఆధారంగానే బోగస్ రికార్డులు సృష్టించి వందల మందితో జాబితా తయారు చేశారు.

సొమ్ము స్వాహా..

మేనేజర్లే పథకరచన చేయడం వల్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నేరుగా రాయితీ పంపిణీ నిబంధనను పక్కన పెట్టేశారు. అలా కొట్టేసిన రూ. 9వేల రాయితీలో మేనేజర్లు రూ. 5,500 - 6,000 వరకు నొక్కేశారు. మిగిలిన సొమ్ములో రూ. 1,500 వరకు ఏజెంట్లు తీసుకున్నారు. అలా ఏడుగురు ఏజెంట్లలో ఒక్కొక్కరి పేరిట రూ. 50 లక్షల వరకు రాయితీ సొమ్ము స్వాహా అయినట్లు దర్యాప్తులో తేలింది.

ఇవీ చూడండి: పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.