రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశు సంక్షేమ భవన్ ముట్టడికి యత్నించిన గొర్రెల కాపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీస్ ముందు జీఎంపీఎస్ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష చేపట్టేందుకు యత్నించారు.
నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్‌కి తరలించారు. రెండో విడత గొర్రెలను వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో... ప్రభుత్వం మెడలు వంచి తీసుకుంటామని గొర్రెల కాపరులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు