లాక్డౌన్ పరిస్థితుల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణ, మూల్యాంకనం, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. దాదాపు అన్ని విభాగాలు ఆన్లైన్ పాఠాలను బోధిస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
జాతీయ, అంతర్జాతీయ విద్యా పోర్టళ్లలోని వీడియో పాఠాల ద్వారా ఆన్లైన్ బోధన జరుగుతోందని పేర్కొంది. ఎక్కవ శాతం సిలబస్ బోధిస్తున్నారని... కొన్ని సార్లు ప్రాజెక్టు రిపోర్టులు, అసైన్మెంట్లకు వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నట్టు తెలిపంది. లాక్డౌన్ ఎత్తివేయగానే సెంటర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!