ETV Bharat / state

Work From Home : వర్క్​ఫ్రమ్ హోంకు చట్టబద్ధత.. వాస్తవమెంత?

author img

By

Published : Dec 13, 2021, 1:14 PM IST

Work From Home : రోజంతా ఆఫీస్‌లోనే గడిచిపోతుంది. ఎప్పుడూ ఆఫీస్‌కే వెళ్లాలా..? ఇలా బాధపడుతున్న సమయంలో లాక్‌డౌన్‌ పుణ్యమా..? అని వర్క్‌ ఫ్రమ్‌ హోం వచ్చేసింది. ఎంచక్కా ఇంట్లోనే పని కానిచ్చేస్తున్నాం. మెుదట్లో బాగానే ఉన్నా...ఈ విధానం ఎక్కడో తేడా కొడుతోంది. ఉండేది ఇంట్లోనే కానీ కుటుంబంతో గడపడానికి సమయం లేదు. 9 టూ 5 అనే బాధ లేదు కానీ, ఎప్పుడూ చూసిన పనే ఉంటుంది. ఆఫీసుకు వెళ్తే వారాంతాల్లో సెలవులతో మైండ్‌ రీఫ్రెష్‌ అయ్యేది. ఇప్పుడు సెలవు దొరికినా బాస్‌ ఎప్పుడు ఫోన్‌ చేస్తారో.. ఏం పని చెప్తారోనన్న భయం. ఉద్యోగ జీవితానికి, రోజువారీ జీవితానికి తేడానే కనిపించక ఒత్తిడి పెరుగుతోందని ఫీలవుతున్నారు. ఇలా బాధపడుతున్న వారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. వర్క్‌ ఫ్రమ్ హోంకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని భావిస్తుందట. ఒకవేళ కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తే.. ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశముంది..? అన్ని రంగాలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విస్తరించడం సాధ్యమేనా..? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

Work From Home, WFH Legalise News
వర్క్​ఫ్రమ్ హోంకు చట్టబద్ధత
వర్క్​ఫ్రమ్ హోంకు చట్టబద్ధత

Work From Home : వర్క్‌ ఫ్రమ్‌ హోం.. 2020 మార్చి కంటే ముందు దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మాత్రమే అప్పుడప్పుడు వినిపించేది. అది కూడా... కనీసం 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం గల వారికే... అత్యవసర పరిస్థితుల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశాన్ని కల్పించేవారు. కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్‌ పడటంతో...దాదాపుగా అన్నిరంగాలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విస్తరించింది. అనుభవంతో సంబంధం లేకుండా... ఐటీ ఉద్యోగలందరు ఇంటి నుంచే పని చేయడం మెుదలుపెట్టారు. మిగతా కార్పొరేట్‌ రంగాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగింది. చివరికీ... మీడియా రంగంలోనూ వర్క్ ఫ్రమ్‌ హోం ప్రవేశించింది. దీంతో... ఎప్పుడూ ఆఫీస్‌కే వెళ్లాలా..? అనుకునేవారికీ ఇంట్లోనే పని చేసుకునే అవకాశం వచ్చింది. సుమారుగా ఏడాదిన్నరగా చాలా మంది ఇదే పని చేస్తున్నారు. మెుదటి వేవ్‌ తరువాత వర్క్‌ ఫ్రమ్‌ హోం ఒరవడికి స్వస్తి పలుకుతారేమో అని అనుకున్నారంతా..! మహమ్మారి ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని ఆయా సంస్థలు పొడిగిస్తూ వచ్చాయి.కరోనా ప్రభావం తగ్గిపోయి ఆఫీసులకు ఉద్యోగులంతా తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్ ముప్పు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో మళ్లీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే విధానాన్ని కంపెనీలు పొడిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇంటి నుంచి పనికి చట్టబద్ధత..!

WFH Legalise News: ఇదే సమయంలో... పలు సంస్థలు శాశ్వత వర్క్ ఫ్రమ్‌ హోంకు అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హైబ్రీడ్‌ విధానానికి ఓటేస్తున్నాయి. ఒమిక్రాన్‌ పోతే... ఇంకో వేరియంట్.. ఇది కాకపోతే... మరో మహమ్మారి. ఇలా ఏదో ఒకటి ప్రపంచాన్ని పట్టి పీడించవచ్చు. ఈ నేపథ్యంలో... వర్క్‌ ఫ్రమ్‌ హోం రాబోయే రోజుల్లో షరామామూలే కావొచ్చు. ఈ తరుణంలో.... వర్క్‌ ఫ్రమ్‌ హోంలో కంపెనీలు ఇష్టమెుచ్చినట్లు శ్రమదోపిడి చేయకుండా... కచ్చితమైన నిబంధనలు పాటించేలా వర్క్ ఫ్రం హోంకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం... వర్క్‌ ఫ్రమ్‌ హోం... ప్రధానంగా సేవల రంగానికే పరిమితం కాగా ఇకపై అన్ని రంగాలకూ వర్తించేలా చూడాలని కేంద్రం భావిస్తోందట. దీనికోసం ఓ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

వీలైనంత త్వరగా బిల్లు..!

Work From Home in india: ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల విషయంలో యాజమాన్యాలు ఎలా మెలగాలనేది ఈ సంస్థ సూచిస్తుంది. ఉద్యోగులకు పని గంటల నిర్ణయం, ఇంటి నుంచి పనిచేసేటప్పుడు కరెంటు, ఇంటర్నెట్‌ వినియోగానికయ్యే అదనపు ఖర్చుల్ని తిరిగి చెల్లించడం వంటివి అధ్యయనం చేస్తోంది. అలాగే, ఓవర్‌ టైమ్‌ చేసే ఉద్యోగులకు ఏ స్థాయిలో డబ్బులు చెల్లించాలో కూడా నిర్ణయించనుంది. అలాగే, ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఉద్యోగులు అనారోగ్యానికి గురైతే... సంస్థలు వేతనంతో కూడిన సెలవుల గురించి ఇందులో చర్చించనున్నారు. ఇలా... అన్ని విషయాలకు సంబంధించి ఆ సంస్థ నుంచి తగు సూచనలు రాగానే.... ఐటీ మంత్రిత్వ శాఖ వీలైనంత త్వరగా బిల్లు రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఉద్యోగులు కూడా తిరిగి ఆఫీసుకు రావడానికి చూస్తున్నారు. పాత విధానంలో కాకుండా హైబ్రీడ్ సెటప్​లో ఉంటుంది. నిర్ణీత సమయంలో కొంతశాతం ఉద్యోగులు ఆఫీసుకు రావాలి. సంస్థల అవసరాన్ని బట్టి ఆఫీసుకు తీసుకొస్తారు.

-శ్రీకాంత్ శ్రీనివాస్, నాస్కామ్ ఉపాధ్యక్షుడు

వర్క్‌ ఫ్రమ్‌ హోం చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏముంది..?

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయడం వల్ల... ట్రావెలింగ్‌ సమయం కలిసి వస్తోంది. పెట్రోల్‌ వంటి ఇంధన భారం నుంచి తప్పించుకోవచ్చు. బయట తినే ఖర్చులు తగ్గుతాయి. ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు... ఓ గంట ఎక్కువ పని చేస్తే తప్పేంటి...? మెజార్టీ సంస్థలు ఇలాగే భావిస్తున్నాయి. ఐతే.... ఆదాయం పెరుగుతోంది సరే, అలాగే అనారోగ్యం పెరుగుతోందంటున్నారు... వైద్యనిపుణులు. వర్క్ ఫ్రం హోం చేసే వారిలో గతంలో కార్యాలయంలో పనిచేసే సమయంలో కంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కార్యాలయానికి వెళ్లడానికి కిలో మీటర్ల దూరం ప్రయాణించడం, నడవడంతో పాటు సహచర ఉద్యోగులతో పని విషయంలో చర్చించడం వంటి అంశాలు వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచి పని చురుకుగా చేసేందుకు దోహద పడేవి. వర్క్ ఫ్రం హోం సమయంలో ఇవన్నీ లోపించడంతో పనిపై ఏకాగ్రత కోల్పోతున్నారు. అంతేకాకుండా శారీరక వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. గంటల సమయం ఒకే పొజిషన్​లో కూర్చోవడంతో వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్క్ ఫ్రం హోం సమయంలో కొన్ని కుటుంబాల్లో గొడవలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

టెక్‌ వర్గాల్లో కొంత సందిగ్ధత

ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికమైన ప్రకటన రాకపోయే సరికీ... టెక్‌ వర్గాల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే... వర్క్‌ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులు చాలా మంది ఆఫీస్‌కు రావాలని కోరుకుంటున్నారు. సంస్థలు సైతం ఉద్యోగుల్ని రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం... ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తేనే... ఆర్థిక చక్రం సరిగ్గా తిరుగుతుందని భావిస్తున్నాయి. ఈ తరుణంలో... వర్క్‌ ఫ్రమ్‌ హోం చట్టబద్ధత కల్పించడం కుదరకపోవచ్చన్నది మరికొందరి అభిప్రాయం.

అన్నిరంగాలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విస్తరింపజేయడం సాధ్యమేనా..?

ఉత్పత్తి, తయారీ రంగంలో దాదాపుగా ఇది సాధ్యం కాదు. ఇదొక్కటే అని కాదు... శారీరక శ్రమ లేకుండా మేధస్సుతో పని చేసే రంగాలు, ఆ స్థాయిలలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ తరహా పని వర్తిస్తుంది. కానీ, మన దేశంలో... 80 నుంచి 90 శాతం ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం లేని ఉద్యోగాలే చేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌కు చట్టబద్ధత కల్పించాలన్నది మంచి నిర్ణయమే కానీ, ఇదేదో సమూలంగా మార్చి వేస్తుందనుకోవడానికి లేదంటున్నారు... ప్రముఖ వ్యాపారవేత్తలు. ఎందుకంటే... దీని వల్ల చాలా తక్కువ మందికే ప్రయోజనం అన్నది గుర్తుపెట్టుకోవాలి.

వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కేంద్రప్రభుత్వం చట్టబద్ధం చేస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వదంతులే. ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి విధానాన్ని తీసుకురాదు. మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోం అనే తాత్కాలిక విధానం. మార్చి, ఏప్రిల్ కల్లా 70శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు రావొచ్చు. ఐటీ ఇండస్ట్రీ కోసమే ఇది ఉపయోగపడుతుంది. మిగతా రంగాల్లో ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోం అనేది అవాస్తవం.

-భరణ్ కుమార్ అరోల్, హైసియా అధ్యక్షుడు

పెరగనున్న వర్క్‌ ఫ్రమ్‌ హోం కల్చర్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోం ద్వారా... సంస్థల కార్యాలయాల నిర్వహణ ఖర్చు, ఉద్యోగుల ట్రావెలింగ్‌ ఖర్చులు తగ్గుతాయి. ఇవి మాత్రమే కాదు.. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్‌ హోం చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉంటుంది. అలాగే, దిల్లీ వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎప్పుడు వరదలు వస్తాయో...? ఎప్పుడు కొండ చరియలు విరిగి పడతాయో తెలియదు. అలాగే, ప్రపంచం క్రమంగా మిషన్‌ కల్చర్ వైపు అడుగులు వేస్తోంది. అంటే... శారీరకంగా చేయాల్సిన పని మిషన్లు కానిచ్చేస్తాయి. వాటిని ఆపరేటింగ్‌ చేసే పని మనిషి తీసుకుంటాడు. ఇలా.. కారణమేదైనా రాబోయే రోజుల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం కల్చర్‌ బాగా పెరుగుతోంది. ఈ తరుణంలో... ఇప్పటి నుంచే కొన్ని విధివిధానాలు నిర్ణయించడం వల్ల... మంచే జరుగుతుందంటున్నారు. ఐటీ నిపుణులు. చూడాలి మరీ, కేంద్రం ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తుందో...!

ఇదీ చదవండి: Miss universe 2021: ప్రపంచం మెచ్చిన 'విశ్వసుందరి' ఈమె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.