ఏర్పాట్లు పరిశీలన
గురువారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏఐసీసీ కిసాన్ విభాగం ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్నందున ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయ పథకాన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తారని కుంతియా వెల్లడించారు.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, రైతు సమస్యలపై రాహుల్ ప్రత్యేక దృష్టిసారించినట్లు సీనియర్ నేత వి.హనుమంతురావు తెలిపారు. విభజన హామీలను అమలు చేసేలా రాహుల్ భరోసా ఇస్తారన్నారు.
కేసీఆర్ తనయుడు కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెటు ఎన్నికల్లో ప్రజలు జాతీయ పార్టీలకే పట్టంకడతారని జోస్యం చెప్పారు.
ఇవీ చూడండి:పారదర్శకంగా ఎన్నికలు