ETV Bharat / state

ప్రభుత్వ యంత్రాంగమే ఖననం చేసేలా ఏర్పాట్లు : మోపీదేవీ

ఏపీ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో 45 మృతదేహాలు పేరుకుపోయాయి. సంబంధించిన వారికి సమాచారం అందించినా బంధువులు ముందుకు రావటం లేదు. ఇందులో 15 మృతదేహాలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎవరూ రాకపోతే... ప్రభుత్వ యంత్రాంగమే ఖననం చేసేలా ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.

ప్రభుత్వ యంత్రాంగమే ఖననం చేసేలా ఏర్పాట్లు : మోపీదేవీ
ప్రభుత్వ యంత్రాంగమే ఖననం చేసేలా ఏర్పాట్లు : మోపీదేవీ
author img

By

Published : Jul 27, 2020, 10:59 PM IST

ఏపీ గుంటూరు సర్వజనాసుపత్రి మార్చురీలో మృతదేహాలు పేరుకుపోయాయి. సుమారు 45 మృతదేహాలతో మార్చురీ గదులు నిండిపోయాయి. సామర్థ్యానికి మించి మృతదేహాలు పేరుకుపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో 15 మృతదేహాలు కరోనా కేసులు కావడంతో వాటిని తీసుకెళ్లేందుకు బంధువులు విముఖత చూపించారు. వారికి సమాచారం ఇస్తున్నప్పటికీ మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

ఆరా తీసిన మోపీదేవీ...

మరోవైపు ఈ మృతదేహాలను ఎలా తరలించాలనే విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ... జీజీహెచ్ మార్చురీలో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితిపై ఆరా తీశారు. దీనిపై జిల్లా కలెక్టర్​తో మాట్లాడానని.. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి వారి నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మోపిదేవి తెలిపారు. ఎవరూ రక్త సంబధీకులు లేని పక్షంలో యంత్రాంగమే ఆయా మృతదేహాలను ఖననం చేస్తుందన్నారు.

ఇవీ చూడండి : 'నవంబర్ వరకు రూ.7500, ఉచిత రేషన్ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.