ETV Bharat / state

రేపే బల్దియా పోలింగ్​.. తుది అంకానికి ఏర్పాట్లు - హైదరాబాద్ పౌర ఎన్నికలు 2020

జీహెచ్​ఎంసీలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. కొత్త పాలకమండలిని ఎన్నుకునేందుకు ఓటర్లు రేపు తీర్పునివ్వనున్నారు. 150 డివిజన్లలో 9 వేల 101 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 74 లక్షల ఓటర్లు 11 వందల 22 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని మంగళవారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. డీఆర్​సీ కేంద్రాల్లో పోలింగ్‌ సామాగ్రిని ఇవాళ సిబ్బందికి అందించనున్నారు.

ghmc elelctions
రేపే బల్దియా పోలింగ్​.. తుది అంకానికి ఏర్పాట్లు
author img

By

Published : Nov 30, 2020, 5:30 AM IST

హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ఎన్నికల పర్వంలో అత్యంత కీలకమైన ఘట్టమైన పోలింగ్‌ మంగళవారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వేల 937 ప్రాంతాల్లో 9 వేల 101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య వెయ్యికి మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు ఉండగా... రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 33 పోలింగ్ కేంద్రాలున్నాయి.

అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో..

మొత్తం 150 డివిజన్లకు గాను సగటున ఎనిమిది మంది చొప్పున 11 వందల 22 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా... ఉప్పల్, బార్కస్, నవాబ్ సాహెబ్ కుంట, జీడిమెట్ల, టోలిచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు చొప్పున ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య 74 లక్షల 44 వేల 260. ఇందులో పురుషులు 38 లక్షల 77 వేల 688 మంది కాగా... మహిళా ఓటర్ల సంఖ్య 35 లక్షల 65 వేల 896. ఇతరులు 676 మంది ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో మైలార్‌దేవ్‌ పల్లి డివిజన్‌లో 79 వేల 290 మంది ఓటర్లు ఉండగా... అతి తక్కువ సంఖ్యలో రామచంద్రాపురం డివిజన్‌లో కేవలం 27 వేల 998 మంది ఓటర్లున్నారు.

పోలింగ్ కోసం 48 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 14 మంది సాధారణ పరిశీలకులతోపాటు 38 వ్యయపరిశీలకులను నియమించారు. ప్రతి సర్కిల్ రెండు చొప్పున 60 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు 30 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 661 మంది జోనల్ అధికారులను నియమించారు. కొవిడ్ నేపథ్యంలో ఈమారు బ్యాలెట్ పత్రాల ఆధారంగానే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 28 వేల 683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పోలింగ్ కోసం 81 లక్షల 88 వేల 686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా ధరించాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. భౌతికదూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. 2వేల 831 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన వాళ్లు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.

ఇవాళ పోలింగ్​ సామగ్రి పంపిణీ..

పోలింగ్‌ సామాగ్రిని ఇవాళ అందించనున్నారు. 150 డివిజన్ల జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 30 డీఆర్​సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు అందించడం, స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్ జోన్‌లో 6, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి జోన్‌లో ఐదేసి, శేరిలింగంపల్లి జోన్‌లో నాలుగు డీఆర్​సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సంబంధిత డివిజన్‌లకు సంబంధించిన సామాగ్రిని అధికారులకు పంపిణీ చేయనున్నారు. ఈసారి ప్రత్యేకంగా కనోనా కిట్లతోపాటు 500 మిల్లీలీటర్ల శానిటైజర్లు సహా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున అందించేందుకు 60 వేల శానిటైజర్లను ఇప్పటికే బల్దియా సిద్ధం చేసింది.

ఇవీచూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.