ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారు పోలీసు విభాగంలో చేరుతున్నారని అదనపు డీజీ జితేందర్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన 237 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ మైదానంలో కవాతు నిర్వహించారు.
జాతి నిర్మాణంలో ఉన్నత విద్యావంతుల పాత్ర ముఖ్యమైనదని అదనపు డీజీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్రాన్ని నేర రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజామిత్ర పోలీసింగ్ విధానం దేశవ్యాప్తంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు. అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని జితేందర్ చెప్పారు. అనంతరం కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మొక్కజొన్న చేనులో మట్టిగుంత.. భయాందోళనలో జనం