ETV Bharat / state

ఏపీలో 427కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు - ఏపీలో 427కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. ఆదివారం మరో 22 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. మొత్తం కేసుల సంఖ్య 427కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు వైరస్ కారణంగా ఏడుగురు మంది మృతి చెందారు. 12 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ap-reached-427-corona-positive-cases
ఏపీలో 427కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు
author img

By

Published : Apr 13, 2020, 4:23 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఆదివారం 22 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు 14 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. గుంటూరులో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 89కి చేరింది.

ఆదివారం సాయంత్రం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసే సమయానికి ఏడు కేసులే నమోదయ్యాయి. ఆ తర్వాత మరో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. వీరిలో ఒకే ఇంట్లో నలుగురు బాధితులు ఉన్నారు. ఈ ఏడు కేసులను వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. గుంటూరులో ఒకరి మృతితో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు వైరస్ బారిన పడగా మొత్తం బాధితుల సంఖ్య 84కి చేరింది. కర్నూలులో ఒకరు, చాగలమర్రి మండలంలో మరొకరికి వ్యాధి సోకినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కొత్త కేసుల్లో బాధితులంతా ఇప్పటికే కరోనా సోకినవారి బంధువులేనని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో మరో నాలుగు కేసులు నమోదుతో మొత్తం బాధితుల సంఖ్య 52కు చేరింది. లాక్​డౌన్​ను మరింత కఠినతరం చేశారు.

నెల్లూరు నగరంలోనే 20 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో చాలాచోట్ల రోడ్లను మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నియోజవర్గంలో 9 పాజిటివ్ కేసులు ఉన్నాయి. నాయుడుపేట, వాకాడు, గూడూరు, కావలి ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 689 నమూనాలు పరీక్షలకు పంపించారు. అందులో 600 నమూనాలు కరోనా వైరస్ లేనట్లు నివేదికలు వచ్చాయి. మరో 38 నమూనాలు రావాల్సి ఉంది.

కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... 307 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కృష్ణా జిల్లా వ్యాప్తంగా నమూనాలు సేకరించనున్నట్టు వివరించారు. రోజుకు 800 నుంచి 1000 నమూనాల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య 41కి చేరింది. కేసులు పెరగేకొద్ది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బద్వేలులో ఓ కేసు నమోదుతో... కడప జిల్లాలో బాధితుల సంఖ్య 31కి చేరింది. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా బాధితుడికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోనూ మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలగా కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య జిల్లాలో 21కి చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండీ... కరోనా నుంచి బయటపడినా మళ్లీ సోకనుందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.