ETV Bharat / state

'ఏపీ రాజధాని అంశానికి, మండలి రద్దుకి సంబంధమే లేదు' - మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారశైలిని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. రాజధాని అంశానికి, మండలి రద్దు నిర్ణయానికి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ap minister bosta satyanaryana about their state capital
'రాజధాని అంశానికి, మండలి రద్దుకి సంబంధమే లేదు'
author img

By

Published : Jan 29, 2020, 8:10 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని ఏపీ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలను చిత్తు కాగితాలని గతంలో చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇప్పుడు ఆ నివేదికల్లోనే.. విశాఖకు తుపాను ముప్పు ఉందని చెబుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని మండలి ఛైర్మన్​ను తాము కోరామని చెప్పారు. మండలి ఔన్నత్యానికి తూట్లు పొడవలేదని స్పష్టం చేశారు. రాజధాని అంశానికి, మండలి రద్దు నిర్ణయానికి సంబంధం లేదన్నారు.

'ఏపీ రాజధాని అంశానికి, మండలి రద్దుకి సంబంధమే లేదు'

ఇదీ చూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.