ETV Bharat / state

ఆదాయం అంతంతే.. తలకిందులైన రెవెన్యూ అంచనాలు - ap revenue deficit news

ఏపీలో రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తలకిందులవుతున్నాయి. రెవెన్యూ లోటు కుంగదీస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్​ అంచనాల్లో చెప్పినా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.26,646 కోట్లుకు చేరింది. వసూళ్లు తగ్గడం వల్ల లోటు పెరిగిపోతుంది.

ap-less-revenue-problems
రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తలకిందులు
author img

By

Published : Jun 17, 2020, 2:18 PM IST

రెవెన్యూ వసూళ్లలో అంచనాలు తప్పుతున్నాయి. అదే సమయంలో రెవెన్యూ ఖర్చులు పెరిగి లోటు తప్పట్లేదు. 2019-20లో రెవెన్యూ లోటును రూ.1778.52 కోట్లకే పరిమితం చేస్తామని బడ్జెట్‌ అంచనాల్లో చెప్పారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం ఏకంగా.. రూ.26,646 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,434.14 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవటం, వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. 2019-20లో రెవెన్యూ వసూళ్లు అంచనాల కన్నా బాగా తగ్గిపోయాయి. రూ.1.78 లక్షల కోట్లు ఉంటాయనుకుంటే.. రూ.1.10 లక్షల కోట్లకే పరిమితమయ్యాయి.

సొంతపన్నుల్లో ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రపన్నుల్లో వాటాలు, కేంద్రం నుంచి అందే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కలిపి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంగా లెక్కిస్తారు. దీనికన్నా రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉంటే లోటుగా పరిగణిస్తారు. 2014-15 నుంచి కూడా రెవెన్యూ లోటు కొనసాగుతోంది. 2018-19లోనే రూ.5235.23 కోట్ల మిగులుతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కానీ బడ్జెట్‌ సంవత్సరం ముగిసేనాటికి మిగులు కనిపించడం లేదు. అది కూడా లోటు సంవత్సరంగానే మారింది. ఏయే రంగాల్లో ఆదాయం వస్తుందో, వేటిలో రాదోనన్న విషయంలో అనుభవాల ప్రతిపదికన అంచనాలు సవరించడం లేదు. అయిదారేళ్ల ఆర్థిక స్వరూపాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఆదాయం రాని మార్గాల్లోనూ అధిక అంచనాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: మీ త్యాగం మరువం: సైనికులకు సినీతారల నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.