ETV Bharat / state

BigBoss 6: 'బిగ్​బాస్' ఆగిపోనుందా?.. ఈ 'షో'పై హైకోర్టులో విచారణ

Big Boss Show 6: బిగ్​బాస్​ షోపై గతంలో సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్​ రెడ్డి ఏపీ హైకోర్టులో వేసిన పిల్​ పై.. హైకోర్టు విచారణ జరిపింది. ఈ కార్యక్రమానికి హోస్ట్​గా ఉన్న నాగార్దునకు, స్టార్​ మాటీవీ ఎండీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటిసులు జారీ చేసింది.

Big Boss Show 6
బిగ్​బాస్​ షో
author img

By

Published : Oct 28, 2022, 11:22 AM IST

AP High Court On Big Boss 6 seassion: బిగ్‌బాస్‌ షో ప్రసారాలు.. చాలా ముఖ్యమైన విషయమని.. దీనిపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని.. ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. బిగ్‌బాస్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్న సినీనటుడు అక్కినేని నాగార్జున, స్టార్‌ మాటీవీ ఎండీ, రాష్ట్ర సీఎస్​, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు వేయాలని పేర్కొంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

హింస, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్‌ షో ఉందంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలన్నారు. దీనిపై కేంద్రం చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందన్నారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంలోనూ కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం సరికాదంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.