ETV Bharat / state

స్థానిక ఎన్నికల నిర్వహణలోపు రంగులు తొలగించండి: ఏపీ హైకోర్టు - రంగుల వ్యవహారంపై హైకోర్టు తీర్పు

పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైకాపా జెండాను పోలిన రంగుల్ని తొలగించేందుకు ఏపీ ప్రభుత్వానికి 3 వారాల గడువు ఇచ్చింది ఆ రాష్ట్ర హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని ఆదేశించింది.

స్థానిక ఎన్నికల నిర్వహణలోపు రంగులు తొలగించండి: ఏపీ హైకోర్టు

author img

By

Published : Apr 20, 2020, 4:27 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు తొలగించాలని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం 3 వారాలు గడువు కోరగా... ధర్మాసనం సమ్మతించింది. గడువులోపు ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని స్పష్టం చేసింది.

పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఇటీవలే విచారణ జరిగింది. 3 నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా... న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణను చేపట్టిన ధర్మాసనం 3 వారాల గడువు ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.