ETV Bharat / state

AP Governor Health News :ఏపీ గవర్నర్ విశ్వభూషణ్​​కు అస్వస్థత.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు - ap governor discharged from AIG

AP Governor News : కొవిడ్​ నుంచి కోలుకుని ఈనెల 23వ తేదీన డిశ్చార్జ్​ అయిన ఏపీ గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhusan Health updates) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హరిచందన్​ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ap governor sick, AP Governor Bishwabhushan Fell Sick
ఏపీ గవర్నర్​కు అస్వస్థత
author img

By

Published : Nov 29, 2021, 7:07 AM IST

Updated : Nov 29, 2021, 7:23 AM IST

AP Governor Biswabhusan Fell Sick: ఆంధ్రప్రదేశ్​ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయణ్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విశాఖకు వెళ్లారు.

ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

AP Governor Hospitalised : ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గవర్నర్​ స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. ఇందులో కరోనా పాజిటివ్​గా తేలింది. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కొద్దిరోజుల తరువాత కోలుకున్నారు. ఈనెల 23వ తేదీనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా.. గవర్నర్​కు కరోనా సోకింది. కొవిడ్​ తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధగా ఉండవద్దని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 29, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.