గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు స్వీకరించేందుకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
సచివాలయ ఉద్యోగులందరికీ రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్.కృష్ణయ్య