ETV Bharat / state

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్ - raithu barosa latest news

ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్‌ రెండో విడత రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఆ రాష్ట్ర సీఎం జగన్ విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లోకి రూ.1,114 కోట్ల నగదును బదిలీ చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్

author img

By

Published : Oct 27, 2020, 4:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత నిధులను మంగళవారం ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్లు జమ చేస్తున్నామన్నారు. 50 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే సంతోషంగా ఉందన్నారు. 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామన్నారు. ఆ రాష్ట్రంలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సహాయం అందుతోందన్నారు. నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.135 కోట్ల పెట్టుబడి రాయితీ కల్పించనున్నట్లు జగన్​ తెలిపారు.

"రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నాం. అక్టోబరు 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ రూ.11,500 చొప్పున జమ చేస్తున్నాం. జూన్‌ నుంచి ఆగస్టు వరకు నష్టపోయిన రైతులకు ఇవాళే సాయం అందిస్తున్నాం. జూన్ నుంచి ఆగస్టు వరకు నష్టపోయిన రైతులకు మంగళవారం సాయం అందిస్తామని.. సెప్టెంబర్, అక్టోబర్‌లో పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోపే పరిహారం చెల్లిస్తాం. రైతుకు అండగా ఉండేందుకు 10 వేల 641 గ్రామాల్లో ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.8వేల 655 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాం."

-జగన్​, ఏపీ సీఎం

'పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రకృతి విపత్తుల ద్వారా పంట నష్టపోయిన 1.66 లక్షల రైతులకు రూ.135.73 కోట్లు సాయం అందిస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి అర్హుడికీ సాయం అందిస్తున్నాం. పాత అప్పులకు జమ చేసుకోని విధంగా ఈ సాయం అందిస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది' అని జగన్​ వివరించారు.

ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసులపై నేడు సీబీఐ కోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.