CID Notice To RRR: హైదరాబాద్లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని.. ఏపీ సీఐడీ పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి.. ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లిపోయారు.
ఏపీలోని తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు.. గురువారం వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఉంటానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు... బయటకొస్తున్న రాఘవ ఆగడాలు