మొక్కజొన్న కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి కోళ్ల పరిశ్రమలకు నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలకు, మరికొందరు వ్యాపారులకు 32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను తక్కువ ధరకు అమ్మారని వివరించారు.
ఇదీ చూడండి :ఆస్తి కోసం అంత్యక్రియల నిలిపివేత...!