జవాబు పత్రాల మూల్యాంకనానికి ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూల్యాంకనానికి.. బోర్డు ఏర్పాట్లలో నిమగ్నమైంది. మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కి పెంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రేపట్నుంచి సమాధాన పత్రాల కోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ నెల 11 లేదా 12 నుంచి మూల్యాంకనం నిర్వహించేందుకు కసరత్తులు వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. జూన్ రెండో వారంలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియకు రంగం సిద్ధం - answer papers coding
జవాబు పత్రాలను దిద్దేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. రేపట్నుంచి జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు బోర్డు వెల్లడించింది.