ETV Bharat / state

Fake Certificate: నకిలీ పట్టాలతో కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ - Telangana news

Fake Certificate: పరీక్షలు రాయకుండానే నకిలీ ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు ఇస్తున్న అక్రమార్కులు భారీ ప్రణాళికను రచించారు. భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా వెయ్యి వరకు నకలీ పట్టాలు తయారీకి రంగం సిద్ధం చేశారు. రూ. 70కోట్ల నుంచి 100కోట్ల వరకు వసూలు చేసుకోవాలని పథకం వేశారని హైదరాబాద్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు.

Fake
Fake
author img

By

Published : Mar 4, 2022, 5:12 AM IST

Fake Certificate: నకిలీ పట్టాలతో కోట్లు కొల్లగొట్టేందుకు అక్రమార్కులు పక్కా పథకం వేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. భోపాల్‌లోని ఎస్​ఆర్​కే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ విజయ్‌ కుమార్‌ను పట్టుకుంటే ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తమపై హైదరాబాద్‌లో కేసు నమోదైందని తెలుసుకున్న వర్సిటీ ముఖ్యులు డాక్టర్‌ సునీల్‌ కపూర్, ప్రొఫెసర్లు లడ్డా, గోపాల్‌పాండా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కొద్దినెలల క్రితం సంప్రదింపులు...

ఇంజినీరింగ్, డిగ్రీలు చదవకుండానే ఎస్​ఆర్​కే వర్సిటీలో చదువుకున్నట్టు ధ్రువపత్రాలు ఇస్తున్న కేతన్‌సింగ్‌ గుండేలా బృందం హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ, బెంగళూరు, రాయచూరు ప్రాంతాల్లోని కన్సల్టెన్సీల యజమానులతో కొద్దినెలల క్రితం సంప్రదింపులు జరిపారు. ఇంజినీరింగ్‌ సర్టిఫికేట్లు కావాలన్నా, ఎమ్మెస్సీ, ఎంసీఏ పట్టాలు కావాలన్నా తమ వద్దకు విద్యార్థులను పంపితేచాలని, ఒక్కో విద్యార్థికి రూ. 50వేల నుంచి లక్ష వరకు కమీషన్‌ ఇస్తామనడంతో మొత్తం వివరాలను కేతన్‌సింగ్‌కు పంపించారు.

23 మంది అరెస్ట్...

జనవరి రెండో వారం నుంచి దశలవారీగా 200 ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, బీఎస్సీ పట్టాలను కేతన్‌ సింగ్‌ వారికి పంపించాడు. కన్సల్టెన్సీల నిర్వాహకుల చెప్పిన వివరాల ఆధారంగా మరో వెయ్యి పట్టాలకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియను సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్‌ చేశామని నేర పరిశోధన అదనపు కమిషనర్.. ఏఆర్ శ్రీనివాస్‌ తెలిపారు.

నకిలీ ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలను అవసరమైన వారికి ఇస్తున్న శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ మేనేజర్‌ పీ. శశిధర్‌ ఇటీవల కోర్టులో లొంగిపోయాడు. శశిధర్‌కు కేతన్‌సింగ్‌ కొన్ని నెలల క్రితం పరిచయమయ్యాడని సమాచారం. మరోవైపు కేతన్‌సింగ్‌ తెలిపిన వివరాలతో ఒంగోలులో ఉంటున్న పాండురంగ రోహిత్‌ను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఖాజాగూడ రాతిసంపదపై స్పందించిన కేటీఆర్... తక్షణమే ఆదేశాలు జారీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.