హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నమోదుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం మరోసారి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి సంయుక్త ఎన్నికల అధికారి అమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, జయరాజ్ కెనడీలు హాజరయ్యారు. అన్ని స్థాయిల ఎన్నికల అధికారులు స్వయంగా ఓటరు జాబితాలు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. 1950 టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్‌చేసిన వారితో స్వయంగా మాట్లాడారు.