Cyberabad Commissionerate Annual Crime Report 2023 : సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత పకడ్బందీగా పని చేస్తామని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పేర్కొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న సైబరాబాద్ ప్రాంతంలో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్న మహంతి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు భారీగా పెరిగాయని, మహిళలపై అత్యాచారం కేసులు తగ్గాయని వెల్లడించారు.
సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ అవినాష్ మహంతి(Cyberabad CP Avinash Mahanty) విడుదల చేశారు. గతేడాది 4,850 కేసులు కాగా, ప్రస్తుతం 5,342 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రూ.232 కోట్ల నగదు మోసం జరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567 మందిని అరెస్ట్ చేశామన్నారు. రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని స్పష్టం చేశారు.
యాక్సిడెంట్లు తగ్గాయి, రేప్ కేసులు పెరిగాయి - హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల
Crime Cases in Cyberabad 2023 : 2023 సంవత్సరంలో రెండు పీడీ యాక్ట్ కేసులు(PD Act Cases in Cyberabad) నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. గతేడాది 2,489 కేసులు రాగా ప్రస్తుతం 2,356 కేసులు నమోదయ్యాయన్నారు. మోసాల కేసులు పెరిగాయని 2022లో 6,276 కేసులు రాగా ఈఏడాది 6,777 కేసులు వచ్చాయని వివరించారు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్య కేసులు పెరిగాయని వెల్లడించారు. 2022లో 93 వస్తే ప్రస్తుతం 105 హత్య కేసులు వచ్చాయని ప్రకటించారు.
సైబరాబాద్ నేర వార్షిక నివేదికలోని అంశాలు :
కేసులు | 2022లో కేసుల సంఖ్య | 2023లో కేసుల సంఖ్య |
మహిళలపై నేరాలు | 2,489 | 2,356 |
మోసాల కేసులు | 6,276 | 6,777 |
హత్య కేసులు | 93 | 105 |
నమోదయిన కేసులు | 4,850 | 5,342 |
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు | 52,124 | |
డ్రగ్స్ కేసులు | 277 |
"సిఫార్సు లేఖలపై పోస్టింగులు ఉండవు. ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుంది. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. వేడుకలకు అనుమతి లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు కమిషనరేట్ సిబ్బంది రెండు నెలలు సమర్థవతంగా పని చేశారు. ఈ ఏడాది జరిగిన జీ 20 సమావేశాలు కూడా జరిగాయి. సైబరాబాద్‌లో కూడా జనాభా ఎక్కువగానే నివసిస్తున్నారు." - అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీ
ఒక్కరికి శిక్ష పడితే- ఆ 100 మందిలో భయం పుడుతుంది : సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి
Cyberabad CP Released Crime Report : సైబరాబాద్ పరిధిలో దోపిడీ కేసులు, చోరీలు పెరిగాయని సైబరాబాద్ సీపీ(Cyberabad CP) తెలిపారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య, కుట్ర కేసు కూడా దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో దారుణం - భార్యను హత్య చేసి కనిపించట్లేదని భర్త నాటకం