ETV Bharat / state

employees PRC Issue: ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు.. - ఏపీ ఉద్యోగుల పీఆర్సీ

employees PRC Issue : ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించింది. కాసేపట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు.

ap prc
ap prc
author img

By

Published : Dec 14, 2021, 4:23 PM IST

employees PRC Issue: ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం సజ్జలతో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. పీఆర్సీపై అధికారుల కమిటీ నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

14.29% ఫిట్​మెంట్​ ప్రతిపాదించిన కమిటీ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ప్రభుత్వానికి సోమవారం తన సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించింది. కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఫిట్‌మెంట్‌ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది.

ఉద్యోగ సంఘాల అసంతృప్తి..

కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌కు తాము వ్యతిరేకమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మాస్టర్స్‌ స్కేల్స్‌ కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ ఇస్తామనడం దుర్మార్గమని పేర్కొన్నాయి. 2018 జులై 1న పీఆర్సీ అమలు చేయాలని కోరితే వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వెల్లడించాయి. తమ 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటని, మిగతా 70 సమస్యలూ పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ప్రకటించాయి. పీఆర్సీ నివేదికపై అధ్యయనం, ఉద్యమ కార్యాచరణపై ఏపీ ఐకాస, ఐకాస అమరావతి 9మంది సభ్యులతో స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. పీఆర్సీ నివేదికను పాక్షికంగానే ఇచ్చారని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నాయి. అధికారుల కమిటీ సిఫార్సులను పరిశీలిస్తే సీఎం జగన్‌ వద్ద తప్ప కింద స్థాయిలో సమస్యలు పరిష్కారం కావనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.

71 డిమాండ్లను పరిష్కరిస్తేనే ఉద్యమవిరమణ

'ఉద్యోగుల 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తాం. పీఆర్సీ నివేదిక మాత్రమే ఇచ్చారు. పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, డీఏలు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, విద్య, వైద్య శాఖల్లోని సమస్యల వంటి ప్రధాన డిమాండ్లపై చర్చలు జరపాలి. సీఎం జగన్‌ లేదా ఆయన నియమించే కమిటీతోగానీ చర్చించిన తర్వాతే ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటాం. 9 మంది సభ్యులతో నియమించిన స్ట్రగుల్‌ కమిటీ.. ఉద్యమం ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యమ కార్యాచరణ ముందుకెళ్లకముందే చర్చించాలని కోరుతున్నాం. పీఆర్సీ నివేదికలోని ప్రధాన సిఫార్సులను వెబ్‌సైట్‌లో పెట్టి, సంఘాలకు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. పీఆర్సీ నివేదికలోని నాలుగు వ్యాల్యూమ్‌లను ఇవ్వలేదు. పీఆర్సీ నివేదికలోని అంశాలు ఉద్యోగులకు నష్టం కలిగిస్తాయి. అక్టోబరు నుంచి ఆర్థిక లబ్ధి కల్పించే సిఫార్సుకు అంగీకరించం. గతంలో పీఆర్సీపై ఒకసారి అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం, అనంతరం సీఎంతో చర్చించేవాళ్లం. ఇప్పుడూ ఆ సంస్కృతి కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.'-ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగులు నష్టపోకూడదనే మాస్టర్‌ స్కేల్స్‌ను ఆహ్వానించాం

'ఏపీ, తెలంగాణల్లోనే మాస్టర్స్‌ స్కేల్స్‌ ఉన్నాయి. ఒక్క సీనియర్‌ ఉద్యోగీ నష్టపోకూడదని మాస్టర్‌ స్కేల్స్‌ను గతంలో అంగీకరించాం. మాస్టర్స్‌ స్కేల్స్‌ కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ అమలు చేస్తామనడం చాలా దుర్మార్గం. పీఆర్సీపై కార్యదర్శులు ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ను ఐఏఎస్‌లు అధ్యయనం చేయలేదు. అధ్యయనం చేస్తామని చెప్పారు. దీనిపై సీఎం చొరవ తీసుకోవాలి. గత పీఆర్సీలోనూ పదేళ్లకోసారి ఇస్తే బాగుండని చెప్పారు. ఉద్యోగులు మాత్రం తమకు ఆనవాయితీగా ఉన్న అయిదేళ్ల పీఆర్సీనే కావాలని కోరాం. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. పీఆర్సీ నివేదికలోని ముఖ్యాంశాలను అన్ని ఉద్యోగ సంఘాలకు ఇచ్చి, వెబ్‌సైట్‌లో పెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. సిఫార్సులను పరిశీలిస్తే సీఎం జగన్‌ వద్ద ఈ సమస్యలు పరిష్కారం కావాల్సిందే తప్ప కింద స్థాయిలో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 2018 జులై 1 నుంచి 50 శాతం ఫిట్‌మెంట్‌ కావాలని కోరాం. ఆర్థిక లబ్ధి వచ్చే ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రకటించడం మాకు ఇబ్బందికరం. సీఎం చొరవ తీసుకొని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సరైన లబ్ధి వచ్చేలా చూస్తారని ఆశిస్తున్నాం. చర్చల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వంతో చర్చలను సుహృద్భావ వాతావరణంలో జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.'- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

ఇదీ చూడండి: CC Camera Inauguration at golkonda: 'తెలంగాణ జీడీపీలో సీసీకెమెరా కీలకపాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.