వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాద్‌నగర్‌కు చెందిన పొలం సత్తమ్మకు తుంటి ఎముక విరిగింది. స్థానిక వైద్యుని సూచన మేరకు రోగిని రాంనగర్‌లోని సౌమ్య ఆసుపత్రికి తరలించారు.
సౌమ్య ఆస్పత్రి వైద్యులు తమకు సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్ నిర్వహించడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందం పరారీలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : రెండు గంటల ముందు నుంచే లోనికి అనుమతి