హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పురాతన ఇల్లు కూలింది. ఇంట్లో నివాసం ఉండే ఇద్దరికి ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపై కప్పు నుంచి మట్టి రాలడాన్ని ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి గమనించాడు. దీంతో అప్రమత్తమై బయటకు పరుగెత్తడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చదవండి: ఇల్లు కూలి తల్లీకూతురు మృతి