Interesting Scene between KTR and Etela: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు, రాజాసింగ్ వద్దకు మంత్రి కేటీఆర్ వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. పిలిస్తే కదా హాజరయ్యేదంటూ ఈటల సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదని కేటీఆర్‌కు హితవు పలికారు.
కేటీఆర్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాజాసింగ్ : ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టీ ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటం లేదంటూ భట్టి ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలని ఈటల అన్నారు. ఈటల వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. దీంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ కేటీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్రమత్తం చేశారు. దీంతో తన ట్రెజరీ బెంచీల వైపు కేటీఆర్ వెళ్లిపోయారు. కేటీఆర్ కంటే ముందు ఈటల వద్దకొచ్చి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు. అసెంబ్లీలో కేటీఆర్ -రాజాసింగ్ మధ్య సైతం సంభాషణ చోటు చేసుకుంది. రాజాసింగ్ కాషాయ చొక్కా వేసుకు రావడంతో.. ఆ చొక్కారంగు కళ్ళకు గుచ్చుకుంటుంది. ఆ రంగు నాకు ఇష్టం ఉండదని కేటీఆర్ అన్నారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్‌లో మీరు వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
Etela Rajender on Governor Speech: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అనేది శుద్ధ తప్పు అన్నారు. ఆరు గంటల కరెంట్ రావట్లేదని రైతులు సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని గవర్నర్ చదివారు: రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావే చెప్పారని ఈటల పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయన్న ఈటల.. ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాత్రమే గవర్నర్ చదివారన్నారు. ధరణీతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేంద్ర నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారని చెప్పారు. గజ్వేల్, సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని విమర్శించారు. ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే పనికి వచ్చే ప్రసంగం అని ఎమ్మెల్యే ఈటల అన్నారు.
ఇవీ చదవండి: